Gamyaanne Song Telugu Lyrics Lyrics - Anurag Kulkarni, Sweekar Agasthi & Sugunamma
Singer | Anurag Kulkarni, Sweekar Agasthi & Sugunamma |
Composer | Sweekar Agasthi |
Music | Sweekar Agasthi |
Song Writer | Sanapati Bharadwaj Patrudu |
Lyrics
సొమ్మసిల్లిపోయి కూలింది కాలం సత్తువంటూ లేక ఇంకెంత కాలం సన్నగిల్లకుంది ఈ వింత దూరం దిక్కుతోసకుండ ఇంకెంత దూరం
సొమ్మసిల్లిపోయి కూలింది కాలం సత్తువంటూ లేక ఇంకెంత కాలం సన్నగిల్లకుంది ఈ వింత దూరం దిక్కుతోసకుండ ఇంకెంత దూరం
గమ్యాన్నే చేధించే స్థైర్యంతో పదా ధైర్యాన్నే సంధించెయ్ వచ్చిందో ఆపద
కాలకూటమైన ఈ తీపి స్పర్శ అమృతంగా మారే దారుందా ఈషా తనువు నీలమౌతూ పెడుతుంటే ఘోషా జీవమున్న చావు పొందిందా శ్వాస
బేతాళ ప్రశ్నేదో వాలిందంటే బదులిచ్చి తీరాలి కాదా లోనున్న భయమంటూ పోవాలంటే దాగున్న సత్యాన్ని వెతకాలంటా
చేయూతనిచ్చే ఆశే ఉంటే ఆ గామి రాదా నీకై గాయాన్ని దాటి చేరాలంటే నిన్నే నువ్వు గామివై
గమ్యాన్నే ఛేదించే స్థైర్యంతో పదా ధైర్యాన్నే సంధించెయ్ వచ్చిందో ఆపదా
నేలలోకి నిన్ను నెడుతుంటే శోకం చూసి చూడనట్టే ఉంటుంది లోకం జరుగుతోంది నిత్య ఏకాకి యుద్ధం నువ్వు తప్ప నీకు ఏముంది సైన్యం
కన్నీళ్ళు నిలువెల్లా ముంచేస్తున్నా ఎదురీది చేరాలి ఒడ్డు దుఃఖాలు నీ చుట్టూ కంచేస్తున్నా ఎదిరించే తెగువుంటే కాదోయ్ అడ్డు
చేయూతనిచ్చే ఆశే ఉంటే ఆ గామి రాదా నీకై గాయాన్ని దాటి చేరాలంటే నిన్నే నువ్వు గామివై
గమ్యాన్నే చేధించే స్థైర్యంతో పదా ధైర్యాన్నే సంధించెయ్ వచ్చిందో ఆపదా
గమ్యాన్నే చేధించే స్థైర్యంతో పదా ధైర్యాన్నే సంధించెయ్ వచ్చిందో ఆపదా
0 Comments