Telugu Songs Lyrics

chilaka o rama chilaka song lyrics

Chilaka Lyrics |Telugu Song Lyrics Lyrics - Vijai Bulganin, Lakshmi Meghana


Chilaka Lyrics |Telugu Song Lyrics
Singer Vijai Bulganin, Lakshmi Meghana
Composer Vijai Bulganin
Music Vijai Bulganin
Song WriterSuresh Banisetti

Lyrics

అతడు: కన్నీటి సంద్రంలోన కంటిపాపే జారిపోదా



కాసేపు నిన్ను చూడకుంటే



ఆమె: ఏవె ఏవెవరి నిన్నటి కలలు, లేవు లేవులే



అతడు: నా చిన్ని గుండెల్లోనా



ఎండమావి చేరిపోదా



నీ నవ్వే నాకు దూరమైతే



ఆమె: ఏంటి ఏంటి ఇది



ఇంతటి బరువు మోయలేనులే



అతడు: వస్తున్నా వస్తున్నా… నీకోసం వస్తున్నా



సుడిగాలి వేగంతో… నీ వైపే వస్తున్నా



ఏ దారి మూస్తున్నా… ఏ దాడి చేస్తున్నా



ప్రాణాలే తీస్తున్నా… నిన్నొదులుకోను హామీ ఇస్తున్నా



అతడు: చిలకా ఓ రామచిలకా



చెరిగేది కాదే ఎదపై నీ ముద్దు మరకా



చిలకా ఓ రామచిలకా



ఆరేది కాదే రగిలే ఈ ప్రేమ తునకా



ఆమె: నా ఆశలకే ఆయువిమ్మని



నా ఊహలకే ఊపిరిమ్మని



నా చీకటికే వెలుగు ఇమ్మని ఎవరినడగడం



అతడు: నీ కంటపడె వీలు లేదని



నీ వెంట వచ్చే దారి లేదని



నా జీవితమె జారుతోందని ఎలా తెలుపడం



ఆమె: ఒక్క పూట ఉండలేకపోయా నువ్వు లేక



వందేళ్ళెట్టా గడపాలిక



అతడు: కన్న కలలే కట్టుకధలాగా మార్చినాది



కాలానికే దయ లేదుగా



అతడు: చిలకా ఓ రామచిలకా



చెరిగేది కాదే ఎదపై నీ ముద్దు మరకా



చిలకా ఓ రామచిలకా



ఆరేది కాదే రగిలే ఈ ప్రేమ తునకా



ఆమె: ఆ వెన్నెలనే అడిగి చూసా



ఈ వేకువనే అడిగి చూసా



నీ జాడనే చూసి చెబుతాయేమో అనీ



అతడు: ఈ గాలితో కబురు పంపా



మేఘాలతో కబురు పంపా



నా వేదనే నీకు వివరించాలి అనీ



అతడు: ఈ కాలంపైన కత్తి దుయ్యాలనుంది



నిన్ను ఇంకా దాచిపెట్టినందుకు



నా దేహంపైన మట్టి పొయ్యాలనుంది



నాకు నీతో రాసి పెట్టనందుకూ…



అతడు: చిలకా ఓ రామచిలకా ఆఆ ఆ



ఓ ఓ రామచిలుకా ఆ ఆ ఆ



అతడు: కన్నీటి సంద్రంలోన కంటిపాపే జారిపోదా



కాసేపు నిన్ను చూడకుంటే



ఆమె: ఏవె ఏవెవరి నిన్నటి కలలు, లేవు లేవులే



అతడు: నా చిన్ని గుండెల్లోనా



ఎండమావి చేరిపోదా



నీ నవ్వే నాకు దూరమైతే



ఆమె: ఏంటి ఏంటి ఇది



ఇంతటి బరువు మోయలేనులే



అతడు: వెళ్తున్నా వెళ్తున్నా దూరంగా వెళ్తున్నా



వెళ్ళాలని లేకున్నా భారంగా వెళ్తున్నా



నువ్వెంతా రమ్మన్నా రాలేను అంటున్నా



నేనంటూ ఏమైనా నువ్వు



క్షేమంగుంటె చాలనుకుంటున్నా



అతడు: చిలకా ఓ రామచిలకా ఆ



నా మనసే నీకు ఎపుడో ఇచ్చాను గనకా



చిలకా ఓ రామచిలకా



జత రావొద్దంటే అలుపే ఒంటరి నడకా




Chilaka Lyrics |Telugu Song Lyrics Watch Video

Post a Comment

0 Comments