Telugu Songs Lyrics

Jai bheem jai bheem

Jai bheem jai bheem Lyrics - Gaddar Narsanna


Jai bheem jai bheem
Singer Gaddar Narsanna
Composer Gaddar Narsanna
Music Kalyan
Song WriterManukotaprasad

Lyrics


వెలివాడలో మాత్రమే వెలిసిరా బొమ్మ
ప్రతి వాడల నిలుపగలిగే యోధులేరమ్మ
ఒక వాడకె పరిమితమా అంబేద్కరుడు
ప్రతివాడికి హక్కు రా నువ్వు పంచినవాడు
తను రసిండు రాజ్యాంగం దేశం కోసం
తను చేసిండు పోరాటం అందరికోసం
తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం
తను చేసిండు పోరాటం అందరికోసం
మరి చీకటినే తరిమేసి వెలుగైనాడు

జై భీమ్ జై భీమ్ జన గుండె నినాదం
అందరమొకటై గెలవాలి సమాజం
జై భీమ్ జై భీమ్ ఒక యుద్దం నినాదం

అందరికోసం మది పోరు ప్రవాహం
మాకెందుకు మాది కాదు ఆనినాదం
అని అవగాహన లేకున్నది కొంత సమాజం
ఆహా రాజ్యాంగం ప్రతిపదాలు పొందు భోజనం
గది అంటే ఏందని అడిగే అవి వేకుల దేశం
జీవితాన్ని ధారపోసినాడురా మనకై
అవమానాలను అనుభవించి నిలిచేరా బలమై
భావితరాల బతుకును మారుసుట కొరకై
అనుసబడిన వాళ్ల కొరకు పుట్టెరా వెలుగై
నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత
నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే
నువ్వు పొందే ఏ పదవి అయినా ఆయన బిక్షే

జై భీమ్ జై భీమ్ జన గుండె నినాదం
అందరమొకటై గెలవాలి సమాజం
జై భీమ్ జై భీమ్ ఒక్క యుద్ధ నినాదం

అందరి కోసం మది పోరు ప్రవాహం
జ్ఞానం వర్ధిల్లాలని పిడికిలెత్తరో
ఆహా జననం జన అజ్ఞానం తొలుచుటకోరుకో
రా జై భీమ్ అని గొంతెత్తి నినదించాలో
ఆహా బడుగు బహుజనులంత ఏకమవాలో
విశ్వవ్యాప్తమయ్యింది ఆయన ప్రతిమా
నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జన్మ
అడుగడుగున జాతి కొరకు కోరిన వాడు
పీడిత జన గోసలనే తరిమిన వాడు
ఎంతమంది ఎత్తుకునేను జై భీమ్ జెండా
ఎవరో ఒక్కరు దిగితే ఉండదు అంట

మనమందరం ఒకటి అయితే విజయం రాక
జై భీమ్ జై భీమ్ జన గుండె నినాదం
అందరమొకటై గెలవాలి సమాజం
జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం


అందరి కోసం మది పోరు ప్రవాహం..




Jai bheem jai bheem Watch Video

Post a Comment

0 Comments