Theme of Kalki (Telugu) Lyrics - Kaala Bhairava, Ananthu, Gowtham Bharadwaj, Chorus
Singer | Kaala Bhairava, Ananthu, Gowtham Bharadwaj, Chorus |
Composer | orchestrated and programmed by Santhosh Narayanan |
Music | Santhosh Narayanan |
Song Writer | Ramajogayya Sastry, Kumaar |
Lyrics
Telugu Lyrics:
అధర్మాన్ని అనిచెయ్యగ
యుగ యుగాన జగములోన
పరి పరి విధాల్లోన విభవించే
విక్రమ విరాట్ రూపమితడే…
స్వధర్మాన్ని పరిరక్షించగ
సమస్తాన్ని ప్రక్షాళించగ
సముద్భవించే అవతారమిదే…
మీనమై, పిదప కూర్మమై
తను వరాహమై, మనకు సాయమై
బాణమై, కరకు ఖడ్గమై
చురుకు ఘాతమై
మనకు ఊతమై…
నిశి తొలిచాడు దీపమై
నిధనం తన ధ్యేయమై
వాయువే వేగమై
కలియుగా స్థితిలయలే కలబోసే
కల్కి ఇతడే…
స్వధర్మాన్ని పరిరక్షించగ
సమస్తాన్ని ప్రక్షాళించగ
సముద్భవించే అవతారమిదే…
ప్రార్థనో, మధుర కీర్తనో
హృదయ వేదనో
మన నివేదనం
అందితే మనవి తక్షణం
మనకు సంభవం
అతడి వైభవం…
అధర్మాన్ని అనిచెయ్యగ
యుగ యుగాన జగములోన
పరి పరి విధాల్లోన విభవించే
విక్రమ విరాట్ రూపమితడే…
స్వధర్మాన్ని పరిరక్షించగ
సమస్తాన్ని ప్రక్షాళించగ
సముద్భవించే అవతారమిదే…
0 Comments