Bujji Thalli Song Lyrics Lyrics - Javed Ali
Singer | Javed Ali |
Composer | Devi Sri Prasad |
Music | Devi Sri Prasad |
Song Writer | Shree Mani |
Lyrics
Telugu Lyrics:
గాలిలో ఊగిసలాడే దీపంలా…
ఊగిసలాడే నీ ఊసందక నా ప్రాణం,
నల్లని మబ్బులు చుట్టిన చంద్రుడిలా…
చీకటి కమ్మెను నీ కబురందక నా లోకం
సుడిగాలిలో పడిపడి లేచే
పడవల్లే తడబడుతున్నా, ఆ ఆ ఆ…
నీకోసం… వేచుందే నా ప్రాణం…
ఓ బుజ్జితల్లీ…
నా కోసం… ఓ మాటైనా మాటాడే…
నా బుజ్జితల్లీ…
నీరు లేని చేపల్లే
తార లేని నింగల్లే
జీవమేది నాలోనా…?
నువ్వు మాటలాడందే
మళ్లీ యాలకొస్తానే
కాళ్లయేళ్ల పడతానే
లెంపలేసుకుంటానే
ఇంక నిన్ను యిడిపోనే…
ఉప్పు నీటి ముప్పుని కూడా
గొప్పగ దాటే గట్టోన్నే…
నీ కంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే…
నీకోసం… వేచుందే నా ప్రాణం…
ఓ బుజ్జితల్లీ…
నా కోసం… ఓ మాటైనా మాటాడే…
నా బుజ్జితల్లీ…
ఇన్నినాళ్ల మన దూరం
తియ్యనైన ఓ విరహం
చేదులాగా మారిందే
అందిరాక నీ గారం…
Click here
దేన్ని కానుకియ్యాలే
ఎంత బుజ్జగించాలే
బెట్టు నువ్వు దించేలా
లంచమేటి కావాలే..?
Click here
గాలివాన జాడే లేదే
రవ్వంతైనా నా చుట్టూ…
అయినా మునిగిపోతున్నానే
దారే చూపెట్టు…
నీకోసం… వేచుందే నా ప్రాణం…
ఓ బుజ్జితల్లీ…
నా కోసం… ఓ మాటైనా మాటాడే…
నా బుజ్జితల్లీ…
Click here
0 Comments