Telugu Songs Lyrics

Arugu Meedha Telugu Songs Lyrics

Arugu Meedha Lyrics - Thaman S, Roshini JKV


Arugu Meedha
Singer Thaman S, Roshini JKV
Composer Thaman S, Roshini JKV
Music Thaman S, Roshini JKV
Song WriterKasarla Shyam

Lyrics

Telugu Lyrics:

అలికి పూసిన అరుగు మీన

కలికి సుందరినై కూసుంటే

పలకరించావేందీ ఓ దొరా..?

సిలక ముక్కు సిన్నీ నా దొరా…

ఎతికి చూస్తే ఏడూళ్ళైనా

నీలాంటోడు ఇక దొరికేనా..?

ఎందుకింత ఉలుకూ ఓ దొరా

ఎండి బంగారాల నా దొరా…

సైకోలెక్కి సందమామ

సిక్కోలంతా ఎన్నెల పంచి

సిన్నబోయి వచ్చావేంది..?

నీలో ఉన్న మచ్చను తలచి

కొండ నిండ వెలుగే నీదిరా…!!

మనసు మీద మన్నేయకురా

నిమ్మలముండు దొర

నా గుండె మీద వాలిపోరా

ఊపిరి పోస్తా దొరా

మనసు మీద మన్నేయకురా

నిమ్మలముండు దొర

నా గుండెలోన తప్పెట గుళ్ల

సప్పుడు నువ్వే దొరా

అలికి పూసిన అరుగు మీన

కలికి సుందరినై కూసుంటే

పలకరించావేందీ ఓ దొరా..?

సిలక ముక్కు సిన్నీ నా దొరా…

గుట్ట గుట్ట తిరిగే ఓ గువ్వ

నీకు దిష్టి పూసలాంటిది సిరిమువ్వ

ఓయ్ రాజా… నెల రాజా, ఆ ఆ

ఎంత కట్టమైన గాని నీ తోవ

నన్ను రెక్కలల్లో సుట్టుకోవా..!

సింతపూలా ఒంటి నిండా

సిటికెడంత పసుపు గుండా

సిన్నదాని సెంపల నిండా

ఎర్ర ఎర్ర కారంగుండా

వన్నెలన్నీ నీవే సూర్యుడా, ఆ ఆ

మనసు మీద మన్నేయకురా

నిమ్మలముండు దొర

నా గుండె మీద వాలిపోరా

ఊపిరి పోస్తా దొరా…

మనసు మీద మన్నేయకురా

నిమ్మలముండు దొర

నా గుండెలోన తప్పెట గుళ్ల

సప్పుడు నువ్వే దొరా...



Arugu Meedha Watch Video

Post a Comment

0 Comments